Headlines
జనసేన పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరినట్లు పార్టీ ప్రకటించింది. బుధవారం సాయంత్రం జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాధాకృష్ణను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న పవన్ కళ్యాణ్, పార్టీ సిద్ధాంతాల కోసం కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని కోరారు