JspNews

JspNews App

తాజా వార్తలను మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి

Jspnews
📢

మీ Advertisement ఇక్కడ ఇవ్వండి

JspNews Website & App లో మీ Business Advertisement ఇవ్వండి

డొక్కాసీతమ్మ అన్నప్రసాద వితరణ 137వ సారి Janasena

డొక్కాసీతమ్మ అన్నప్రసాద వితరణ 137వ సారి

జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణం మెయిన్ రోడ్డు అమరావతి బస్ స్టాప్ వద్ద దాతల సహాయం తో 140మంది నిరుపేదలకు ప్రయానికులకు ఉచ్చితము గా పెద్దలు సమక్షంలో పెట్టడం జరిగింది
5 సత్తెనపల్లి
కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు Janasena

కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.
5 పిఠాపురం
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన కమిటీ.. 14 మందికి కీలక బాధ్యతలు Janasena

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన కమిటీ.. 14 మందికి కీలక బాధ్యతలు

స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మండలి బుద్ధ ప్రసాద్, టి.పి.శివ శంకర్, కందుల దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాస్, దేవ వరప్రసాద్, వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, ధర్మరాజు, చిలకం మధుసూదన రెడ్డి, గోవిందరావు, సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కొరికన రవి కుమార్‌లను సభ్యులుగా నియమించారు.
6 పిఠాపురం
తెలంగాణలో జనసేన బలోపేతానికి కృషి చేస్తా: రాష్ట్ర అధికార ప్రతినిధి హసీనా Janasena

తెలంగాణలో జనసేన బలోపేతానికి కృషి చేస్తా: రాష్ట్ర అధికార ప్రతినిధి హసీనా

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ శ్రీమతి హసీనా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు అందించిన ప్రేమ, ఆశీస్సులు, ప్రోత్సాహం తనపై మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి తెలంగాణ ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జై జనసేన.. జై తెలంగాణ అని తెలిపారు.
10 పిఠాపురం
జనసేన పార్టీ కమిటీల నియామకానికి మరికొన్ని వారాల సమయం Janasena

జనసేన పార్టీ కమిటీల నియామకానికి మరికొన్ని వారాల సమయం

మంగళగిరి: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కమిటీల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని మరింత పెంచడంతో పాటు, వివిధ స్థాయిల్లో పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సమర్థులైన వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేసేందుకు మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉందని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
5 పిఠాపురం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన కుంచా అంజిబాబు Janasena

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన కుంచా అంజిబాబు

కె.కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామపంచాయతీలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సమాచార సేకరణ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు కుంచా అంజిబాబు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, స్వచ్ఛత, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని అంజిబాబు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
0 పిఠాపురం
సరికొత్త హంగులతో మరింత కొత్తగా JSPNews ఒక్క క్లిక్‌తో  జనసేన న్యూస్ Janasena

సరికొత్త హంగులతో మరింత కొత్తగా JSPNews ఒక్క క్లిక్‌తో జనసేన న్యూస్

ఒక్కో మెట్టు ఎదుగుతూ మరింత చేరువయ్యేలా JSPNews యాప్‌ను సరికొత్త హంగులతో అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఒక్క క్లిక్‌తో మీ నియోజకవర్గంలో జరుగుతున్న జనసేన కార్యక్రమాలు, స్థానిక వార్తలను సులభంగా పోస్ట్ చేయడంతో పాటు, వార్తలను ఇమేజ్ రూపంలో వేగంగా షేర్ చేసుకునే అవకాశం కల్పించాం. జిల్లా, నియోజకవర్గాల వారీగా వార్తలను ప్రత్యేకంగా చూసే సదుపాయంతో మీ ప్రాంతానికి సంబంధించిన జనసేన సమాచారాన్ని మరింత సులభంగా తెలుసుకోవచ్చు. ఇంకా ఎన్నో కొత్త ఫీచర్లను మీ కోసం అందిస్తున్నాం. మీ అభిప్రాయం మాకు ఎంతో ముఖ్యం.. ఒక్కసారి JSPNews యాప్‌లో వార్తలను చూసి, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
19 పిఠాపురం
కాకినాడ GGHలో క్యాన్సర్ చికిత్సకు కొత్త సదుపాయాలు: MP ఉదయ్ శ్రీనివాస్ Janasena

కాకినాడ GGHలో క్యాన్సర్ చికిత్సకు కొత్త సదుపాయాలు: MP ఉదయ్ శ్రీనివాస్

కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు చర్యలు జరుగుతున్నాయని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. రూ.36.6 కోట్లతో డ్యూయల్ ఎనర్జీ LINAC యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ONGC CSR నిధులు సమకూరుతున్నాయని పేర్కొన్నారు. రూ.3.5 కోట్లతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం కూడా త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. CT సిమ్యులేటర్, HDR బ్రాకీథెరపీ తదితర సదుపాయాలతో కాకినాడతో పాటు పరిసర జిల్లాల క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఎంపీ వెల్లడించారు.
12 పిఠాపురం
అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవం Janasena

అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవం

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకవర్గ కే కోటపాడు మండలం నుండి అనకాపల్లి జిల్లా సమాచారం సేకరణ కమిటీ సభ్యులు అంజిబాబు, చౌడువాడ పిఎసిఎస్ సభ్యులు రాజీ నారాయణమూర్తి, జనసేన ఉద్యమి సభ్యులు గంగమళ్ళ అప్పలరాజు, సారా రమేష్ మరియు మండలం నుంచి కుటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు
21 మాడుగుల
పాతపట్నం దేవాలయ కూల్చివేతపై జనసేన నేత రాయపాటి అరుణ ఘాటు వ్యాఖ్యలు Janasena

పాతపట్నం దేవాలయ కూల్చివేతపై జనసేన నేత రాయపాటి అరుణ ఘాటు వ్యాఖ్యలు

పాతపట్నం నియోజకవర్గంలో దేవాలయ కూల్చివేత ఘటనపై జనసేన నేత రాయపాటి అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే ప్రతి అభివృద్ధి పనిని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకుంటారని, అలాంటప్పుడు ప్రభుత్వ భూమిలో ఉన్న దేవాలయం కూల్చివేతకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే దేవాలయాన్ని కూల్చివేశారా? లేక తెలిసే ఈ చర్య జరిగిందా? అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు జరిగిన సమయంలో అక్కడ ఉన్న బాధ్యులు ఎందుకు స్పందించలేదని, వాస్తవాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఎలాంటి అధికారిక పదవి లేని వ్యక్తి చెప్పిందనే కారణంతో అధికారులు దేవాలయాన్ని కూల్చివేస్తారా అని ప్రశ్నించిన రాయపాటి అరుణ.. ఈ ఘటనపై పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
16 పిఠాపురం
మరిన్ని వార్తలు వస్తున్నాయి...
JspNews
News
NEWS

Advertisement
Advertisement
మరిన్ని తాజా వార్తలు
కుడివైపు స్వైప్ చేస్తే Close
JspNews Advertisement
Advertisement

JspNews Advertisement

మీ Advertisement కోసం WhatsApp చేయండి



Janasena Videos Cricket Contact Feedback